ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దు...

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారన్నారు. ప్రజలందరు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం ప్రత్యేక వార్డ్ ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. పుకార్లను నమ్మొద్దు. ఎవరైనా పుకార్లు పుట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎవరైనా దేశీయ, విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వస్తే వారిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమతి ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రులకు చెందిన డాక్టర్ లు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు.