సాయంత్రం ‘అహం బ్రహ్మాస్మి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మూడేళ్ల విరామం తరవాత మంచు మ‌నోజ్ న‌టిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ . పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై  నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు తన తల్లి మంచు నిర్మలాదేవితో కలిసి మనోజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర లోగో విడుద‌ల కాగా, సాయంత్రం 5.22 ని.ల‌కి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. మంచు అభిమానులు ఫ‌స్ట్ లుక్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 


చిత్రంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్, నటి ప్రియా భవానీ శంకర్‌ను మనోజ్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేశారట. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తుండటంతో మూవీపై అంత‌టా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో విడుద‌ల కానున్న ఫ‌స్ట్ లుక్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.