భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 150 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 కరోనా కేసులు నమోదు కాగా..12 మంది చనిపోయారు. ఆ తర్వాత కేరళలో 241 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వ్యాధి సోకి ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరగా..ఆరుగురు చనిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 87 మందికి కరోనా సోకింది.