తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నేడు 20 మంది వ్యక్తులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నేడు కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1107కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 430. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌-19 వ్యాధి నుంచి 648 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నేడు ఈ 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.