కాచిగూడలో వైన్‌షాపు సీజ్‌

నగరంలోని కాచిగూడలో ఓ వైన్‌షాపును ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం... గత కొన్ని రోజులక్రితం ఇందిరాపార్కు వద్ద ఓ ఇంటిలో మద్యం బాటిళ్లు లభించాయి. ఎక్కడివని ఆరా తీస్తే సదరు మద్యం దుకాణం నుంచి తీసుకువచ్చినట్లుగా తెలిపారు. బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు నేడు సీజ్‌ చేసిన బాటిళ్లపై ఉన్న లేబుళ్లను, దుకాణంలోని బాటిళ్లపై లేబుళ్లతో సరిపోల్చి చూడగా ఒకటేనని తేలింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టిన ఎక్సైజ్‌ అధికారులు షాప్‌ను సీజ్‌ చేశారు.